![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -375 లో ....అమూల్యకి విశ్వ ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చెయ్యదు. దాంతో శ్రీవల్లికి ఫోన్ చేసి.. ఫోన్ అమూల్యకి ఇవ్వమని అంటాడు. ఇవ్వనని శ్రీవల్లి అనగానే నువ్వు ఇవ్వకుంటే ఏం చేస్తానో తెలుసా.. నా చేతిలో మైక్ ఉంది.. ఇప్పుడే అందరికి వినపడేలా మా లవ్ కి మీడియేటర్ నువ్వేనని చెప్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు విశ్వ. దాంతో సరేనని శ్రీవల్లి ఫోన్ తీసుకొని వెళ్తుంటే అప్పుడే వేదవతి పిలుస్తుంది. దాంతో శ్రీవల్లికి భయం వేస్తుంది.
వెళ్లి పోయి మీద పాలు పెట్టాను చూడమని చెప్తుంది. అప్పుడే విశ్వ మళ్ళీ ఫోన్ చేస్తాడు. తీసుకొని వెళ్లి అమూల్యకి ఇస్తుంది శ్రీవల్లి. ఇంకొకసారి నాకు ఫోన్ చెయ్యకు.. మా వాళ్ళకి నచ్చిన అతన్ని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి అమూల్య ఫోన్ కట్ చేస్తుంది. దాంతో విశ్వకి కోపం వస్తుంది. మరొకవైపు ధీరజ్, ప్రేమ ఇద్దరు శుభలేఖలు సెలెక్ట్ చెయ్యడానికి కార్ లో వెళ్తారు. టామ్ అండ్ జెర్రీ లాగా ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. మరోవైపు విశ్వ కోపంగా ఉంటే అప్పుడే భద్రవతి వస్తుంది. అమూల్య అన్నమాటలు విశ్వ చెప్తాడు.
దానికి ఎందుకు టెన్షన్ నేను చెప్పినట్టు చెయ్యమని సలహా ఇస్తుంది భద్రవతి. మరొకవైపు ఆనందరావు మార్కెట్ కి వెళ్తుంటే తన చుట్టు ముగ్గురు సెక్యూరిటీలాగా వెనకాలే వెళ్తారు. తన వెంటే ఇంటికి వస్తారు. ఆనందరరావు వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. తనని కార్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. అది భాగ్యం చూసి కార్ వెనకాల పరుగెడుతుంది. మరొకవైపు ప్రేమ, ధీరజ్ ఇద్దరు శుభలేఖ సెలెక్ట్ చేస్తునే గొడవపడతారు. అది చూసిన ఓనర్.. మీరు షాప్ ని ఏం చెయ్యాలనుకుంటున్నారు. ముందు సెలెక్ట్ చెయ్యండి అని అంటాడు. దాంతో ఇద్దరు ఒక కార్డ్ ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళిద్దరిని చూసిన ఓనర్.. మంచి జంట అని అంటాడు. దాంతో ప్రేమ మురిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |